జూన్ 26న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ కు ABVP పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ బందుకు పిలుపునిస్తున్నట్లు ABVP రాష్ట్ర నాయకులు తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు వెంటనే బుక్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇది ఇలా ఉండగా, డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన తెలంగాణ పాలిసెట్ సీట్లను నేడు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్ కు హాజరై, ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని చెప్పారు. మొత్తం 26,109 మంది విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరు కాగా, 19,144 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు.