ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తోన్న సభ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ‘జన గర్జన’ కాదని, కుల గర్జన, స్వార్థ గర్జన, కుటుంబ గర్జన, రెడ్డి గర్జన, అవినీతి, అక్రమ గర్జన అని మండిపడ్డారు ఆయన. ఈ నేపధ్యం లో ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు ఆయన. ఈ సభకు ఖర్చు పెట్టడానికి పొంగులేటికి వంద కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని అడిగారు పాల్. పొంగులేటిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని అన్నారు. ప్రజా యుద్దనౌక గద్దర్ పార్టీ పెట్టి మళ్లీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నారని విమర్శించారు.
గద్దర్ ‘బానిసలారా బయటికి రండి’ అంటూ గద్దర్ పాట రాశారని, కానీ నేడు గద్దరే బానిస లాగా అయ్యారని, అలాంటి వారే బానిస అయితే ఇంకా ఏం చెప్పాలని డిమాండ్ క్సహేశారు పాల్. కుటుంబ పాలన కుల పాలన అంతం చేయాలంటే.. అంబేద్కర్ ఫూలే ఆశయాలను నెరవేర్చాలంటే అవినీతి పాలనకు, రెడ్డి పాలనను అంతం చేయాలన్నారు ఆయన. 54 ఏళ్ల గాంధీ కుటుంబ పాలనలో అవినీతి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని తెలిపారు.