కొన్ని రోజుల్లో ఇండియాలో వర్షాకాల సమావేశాలు జరిగానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలలో అధికార ఎన్డీఏ కూటమి కొన్ని బిల్లులను సభలో ప్రవేశ పెట్టడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక బిల్లు UCC … కామన్ సివిల్ కోడ్ … అయితే ఈ బిల్లుపైన ఇప్పటికే అందరికీ ఒక అవగాహనా ఉండడం మూలంగా ఎవరికి వారు తమ అభిప్రాయాలను కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు కొందరి నుండి వచ్చిన కామెంట్స్ ప్రకారం చూస్తే, ఈ బిల్లు సభలో ఖచ్చితంగా పాస్ అయ్యాయి ఛాన్సెస్ ఎక్కవగా ఉన్నాయి. కానీ తెలంగాణలోని MIM పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ఈ బిల్లుపైన కీలక వ్యాఖ్యలు చేశాడు. కేంద్రం తీసుకురావాలి అనుకుంటున్న ఈ బిల్లు అమలులోకి వస్తే ప్రజాస్వమ్యనికి ఏమాత్రం మంచిది కాదన్నారు. మేము ఈ బిల్లును సభలో పాస్ కాకుండా ఉండడానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలిపారు. కాగా తెలంగాణ అధికార పార్టీ BRS కు సంబంధించి కూడా ఈయనే విషయాన్నీ చెప్పడం విశేషం.
అసదుద్దీన్ మాట్లాడుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేసీఆర్ కూడా మద్దతు ఇచ్చారని చెప్పారు. ఇక మిగిలిన పార్టీల నేతల నుండి కూడా మద్దతు కోసం అడుగుతామని ఈయన తెలిపారు.