ఆంధ్రప్రదేశ్ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఏపీతో పాటు యానంలో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని యానాం, ఉత్తరకోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు అంచనావేశారు. ఇదిలా ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం ఉరుముఎలతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
ఇక, ఎల్లుండి అంటే ఈ నెల 12వ తేదీన పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు ఈ నెల 13వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని లెల్లడించారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్.