ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ అయిన గూగుల్ పే వినియోగదారులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు యూపీఐ పిన్ను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా వేగంగా, ఒక-క్లిక్‌తో యూపీఐ లావాదేవీలను చేయడానికి గూగూల్ పే తన ప్లాట్‌ఫారమ్‌లో యూపీఐ ని అందుబాటులోకి తెచ్చింది. లైట్ ఖాతా వినియోగదారు బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడి ఉంటుందని.. అయితే అది రియల్ టైమ్‌లో జారీ చేసే బ్యాంకు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
రోజువారీ లిమిట్ రూ.4వేలు మాత్రమే ఉంటుంది. ఒకేసారి రూ.200 వరకు మాత్రమే యూపీఐ లైట్ ద్వారా పేమెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. చిన్న చిన్న లావాదేవీలు వేగవంతంగా పూర్తయ్యే లక్ష్యంతో పెట్టుకున్నామని, ఇందులో భాగంగా యూపీఐ లైట్‌ను తీసుకువచ్చినట్లు వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంఘే పేర్కొన్నారు. యూపీఐ లైట్ కోసం యూజర్లు తమ ప్రొఫైల్ పేజీకి వెళ్లి యాక్టివేట్ యూపీఐ లైట్‌ను ట్యాప్ చేయాలని, ఆ తర్వాత లింకింగ్ ప్రక్రియ పూర్తయ్యాక.. యూపీఐ అకౌంట్‌కు రూ.2వేల వరకు యాడ్ చేసుకోవచ్చని చెప్పారు. రోజుకు గరిష్ఠంగా రూ.4వేల వరకు మాత్రమే పరిమితి ఉంటుందని ఆయన తెలిపారు.