వైసీపీ నేతల కోసమే అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ : పయ్యావుల

-

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. రాయలసీమ కరవు నివారణ పేరుతో రూ.900 కోట్లను దారి మళ్లించారని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో భారీ స్కాంకు పాల్పడ్డారన్నారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి తెర లేపారని, రాయలసీమ కరవు నివారణ కార్పోరేషన్ పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు చేశారని వివరించారు.

Payyavula says TDP will protect Indu Group lands in Ananthapur

ఇసుక తవ్వకాల్లో నెలకు రూ.300 కోట్ల దోపిడీ యథేచ్చగా జరిగిందన్నారు. తాడేపల్లి ఖజానాకు ఇసుక దోపిడీ సొమ్ము రూ.12 వేల కోట్లు చేరాయన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. ఇసుక దోపిడీ జరుగుతోందని, పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రూ.900 కోట్ల భారీ స్కామ్ జరిగిందని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news