తెలంగాణలో రెండు రోజుల పాటు పాఠశాలలు బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి.
చాలా ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లి రహదారులపైకి నీరు చేరుతోంది. మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరుతోంది. ఇన్నాళ్లూ నీరు లేక వెలవెలలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు జలకళతో సందడిగా మారాయి. ఇక నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంఓనే.. తెలంగాణలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు మంత్రి సబితా కీలక ప్రకటన చేశారు.