ఏపీ సీఎం జగన్ చేతికి ఎముక లేకుండా సంతకాలు చేసేస్తున్నారు. ప్రత్యేకించి చిరు ఉద్యోగుల జీతాలు బాగా పెంచుతున్నారు. తాజాగా.. ఆస్పత్రుల్లోని పారిశుధ్య కార్మికులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు మేరకు వారి వేతనాలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా పెంపుతో పారిశుధ్య కార్మికులు నెలకు రూ. 16 వేల వరకు జీతం అందుకోనున్నారు. ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యారోగ్య కళాశాలల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఈ పెంపు వర్తిస్తుంది.ఇదే కాదు.. ఇంకా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సీఎం జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గతంలో చంద్రబాబు ఆశావర్కర్ల జీతాలు కూడా పెంచారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ తెచ్చారు. హోంగార్డుల రోజు భత్యాలు పెంచారు. ఇలా జగన్ చిన్న ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ దీపావళి రోజు వారి కుటుంబాల్లో వెలుగులు ఖాయం.