ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. వారాహి యాత్ర చేసి..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాగే స్థానికంగా వైసీపీ నేతల అక్రమాలు అంటూ ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు.
ఇలా పవన్ దూకుడు వల్ల చంద్రబాబు వెనుకబడ్డారు. ఏదో వార్ జగన్ వర్సెస్ పవన్ అన్నట్లు సాగుతుంది. దీని వల్ల టిడిపి రేసులో వెనుకబడింది. పైగా పొత్తు విషయంలో పవన్ దూకుడుగా ఊన్నారు. తాము చెప్పినట్లే టిడిపి వినాలి అన్నట్లు ఉన్నారు. ఇలాంటి పరిణామాలు టిడిపికి ఇబ్బందిగా మారాయి. ఇక ప్రజల్లో ఉన్నప్పుడే కాదు. సోషల్ మీడియా వేదికగా కూడా పవన్..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ మధ్య బైజూస్ అంశంపై విమర్శలు చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలు మిస్ అవ్వడంపై కేంద్రం ఇచ్చిన నివేదికతో వైసీపీపై విరుచుకుపడుతున్నారు.
ఇప్పుడు వరదలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇక వారిని ఆదుకోవాలని చెబుతూనే..వైసీపీ జగనన్న కాలనీల్లో అక్రమాలు చేసిందని, కోట్లకు కోట్లు వైసీపీ నేతలు నోక్కేశారని, పైగా చెరువుల్లో, వాగుల్లో పూడ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చారని దీని వల్ల చిన్నపాటి వానకే కాలనీలు నీట మునుగుతున్నాయి.
తాజాగా వరదల వల్ల నీట మునిగిన జగనన్న కాలనీలని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలని జనసేన శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. దీంతో జగన్ ప్రభుత్వం కాలనీల్లో చేసిన అక్రమాలు బయటపడతాయని అంటున్నారు. ఇక పవన్ పోరాటం వల్ల జగన్‌కు ఇబ్బందో కాదో గాని..బాబుకు మాత్రం ఇబ్బంది అని చెప్పవచ్చు. పవన్ దెబ్బతో బాబు వెనుకబడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బాబుకే ఇంకా నష్టం.