హస్త కళలకు ఒకప్పుడు ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. హస్త కళల ఉత్పత్తులకు తగిన ఆదరణ లేక కళాకారులు ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని వాళ్ళకోసమే తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా రూ. 8000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక పూర్తి వివరాలు చూసేద్దాం..
దేశంలోని హస్త కళాకారులందరూ ఈ స్కీమ్ కి అర్హులు. హస్త కళలల్లో శిల్పి గురు పురస్కారం లేదా జాతీయ పురస్కారం లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ద్వారా అవార్డులు పొందిన హస్త కళాకారులందరూ దరఖాస్తు చెయ్యవచ్చు. అలానే మెరిట్ సర్టిఫికెట్ పొందిన హస్త కళాకారులు కూడా దరఖాస్తు చెయ్యవచ్చు. మార్చి 31, 2023 నాటికి 60 ఏళ్ల వయసు నిండి ఉండాలి.
అలానే హస్త కళాకారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1 లక్ష లోపు మాత్రమే ఉండాలి. గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు ఇవ్వాలి. మండల రెవెన్యూ అధికారి లేదా కలెక్టర్ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాన్ కార్డు, ఆధార్‌తో లింక్ అయినా అకౌంట్ వివరాలు కూడా ఇవ్వాలి.
https://www.handicrafts.nic.in/cmsUpload/20230602164150hindi%20and%20english%20merged.pdf ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 31లోపు ఢిల్లీలోని హస్త కళల ప్రధాన కార్యాలయంలో సుమిత్ చేయాలి. వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్ 18002084800కి సంప్రదించవచ్చు.