తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా ప్రాంతాలకు వరదలకు మునిగిపోయాయి. ఈ తరుణంలోనే.. రేపు అంటే ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బృందం రానుంది.
వివిధ శాఖల అధికారులతో కూడిన ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీమ్.. తెలంగాణ రాష్ట్రానికి రానుంది. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది కేంద్ర బృందం. ఇక ఈ వరద నష్టాన్ని అంచనా వేయనున్న టీమ్…కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
కాగా,తెలంగాణలోని వరద పరిస్థితిపై మూడో రోజూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పర్యవేక్షణ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తాజాగా మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చారు.