ఐపీఎల్ కు ముందు మరియు సీజన్ మధ్యలోనే కొందరు ఇండియా ఆటగాళ్లు గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో రాహుల్, శ్రేయాస్ అయ్యర్, పంత్, బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బుమ్రా మరియు ప్రసిద్ధ కృష్ణ లు గాయాల నుండి పూర్తిగా కోలుకుని ఐర్లాండ్ తో జరగబోయే సిరీస్ కు సిద్ధం అయ్యారని బీసీసీఐ ప్రకటించింది. అయితే కీలక ప్లేయర్లుగా ఉన్న రాహుల్ మరియు శ్రేయాస్ అయ్యర్ లు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని బీసీసీఐ తెలిపింది. ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనితో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్ కు వీరు ఆడేది అనుమానంగానే ఉంది.
ఈ వారం చివర్లో బీసీసీఐ ఆసియా కప్ లో పాల్గొనబోతున్న జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో వీరిద్దరి గురించి చర్చలు జరగ్గా … ఆ సమయానికి ఫిట్ గా ఉండడం కష్టమేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే వరల్డ్ కప్ కు మాత్రం వీరికి ఇంకా విండో క్లోజ్ అవలేదని తెలుస్తోంది.