ఏపీలో 9 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని…వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ ప్రకటించారు. వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజ రైన వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణ…పరిశీలకులను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు.
9 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని… ఈ నాలుగేళ్ళల్లో జగన్ ప్రభుత్వం అన్ని కష్టాలను ఎదుర్కొని సంక్షేమ పాలనను అందించగలిగిందని వివరించారు. వైసీపీ మళ్ళీ గెలవటం ఖాయం… గెలుపు స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు సజ్జల.
ఇది ఇలా ఉండగా, రేపు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్. ముంపు ప్రభావిత అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి…రేపు ఉదయం 9.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. కూనవరం మండలం కోతులగుట్ట గ్రామం చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్… వరద ప్రభావం, తీసుకుంటున్న చర్యలను సమీక్షించనున్నారు.