ఈ రోజు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడారు. ఇంకా విపక్ష పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానం గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతూ ప్రజల్లో మద్దతు పూర్తిగా లేదని, అనవసరంగా విపక్షాలు సమయాన్ని వృధా చేస్తున్నారు అంటూ మాట్లాడారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన చాలా అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి అంటూ అమిత్ షా గుర్తు చేశారు. మా ప్రభుత్వంపై ప్రజలలో అపనమ్మకం కలిగించడానికి విపక్షాలు పన్నుతున్న కుట్రలు అంటూ అమిత్ షా మండిపడ్డారు. పార్లమెంట్ లో మాట్లాడడానికి ఏ సమస్యలు లేని విధంగా, ఇప్పుడు అవిశ్వాస తీర్మానము గురించి మాట్లాడుతున్నారు అంటూ అమిత్ షా గట్టిగా మాట్లాడారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికలలోనూ ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అమిత్ షా.