ఎడిట్ నోట్: మూడు వ్యూహాలతో..మూడో విజయం.!

-

తెలంగాణలో మూడో విజయం కోసం కేసీఆర్ గట్టిగా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు ఎన్నికల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టి బి‌ఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకుని అధికారంలోకి తీసుకొచ్చి తాను రెండు సార్లు సి‌ఎం అయ్యారు. ఇప్పుడు మూడోసారి గెలుపుపై కే‌సి‌ఆర్ ఫోకస్ పెట్టారు. ఆ దిశగానే రాజకీయం నడిపిస్తున్నారు. కానీ గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా పోటీ ఇవ్వలేదు. ఈ సారి కాంగ్రెస్ నుంచి కాస్త పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కే‌సి‌ఆర్ అలెర్ట్ అయ్యారు. కాంగ్రెస్‌ని దెబ్బకొట్టే దిశగానే ఆయన ముందుకెళుతున్నారు.

కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు ప్రదర్శిస్తుంది. గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలై..అధికారం కోల్పోయింది. ఈ సారి ఎలాంటి పరిస్తితుల్లోనైనా అధికారం దక్కించుకోవాలని చెప్పి కాంగ్రెస్ కష్టపడుతుంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ కూడా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల మద్ధతు కూడబెట్టడానికి పదునైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. మొదట తాము చేసిన పనులని ప్రజలకు చెప్పుకోవడం.

అభివృద్ధి, సంక్షేమం..ఈ రెండు సమానంగా అమలు చేసిన తీరు. బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ మరింత అభివృద్ధి చెందింది..ఐటీ ఇండస్ట్రీలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్, సిద్ధిపేట, నిజామాబాద్ లాంటి పట్నాలకు విస్తరించింది. ఐటీనే కాదు..అన్నీ రంగాల్లో తెలంగాణ ముందుంది. అటు సంక్షేమ పథకాలని సైతం అద్భుతంగా అమలు చేస్తున్నారు.

ఇక రెండోది..రాజకీయంగా బి‌ఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని స్థానంలో ఉంది. బలమైన నేతలు, బలమైన కేడర్ ఉంది. మూడోది ప్రతిపక్షాలని బలపడకుండా చేసి సత్తా చాటాలనేది కే‌సి‌ఆర్ ప్లాన్. ఆ దిశగానే రాజకీయం నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది గాని..అన్నీ స్థానాల్లో బలంగా లేదు. అటు బి‌జే‌పి కొన్ని స్థానాలకే పరిమితమైంది. ఇక ఈ రెండు పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే బి‌ఆర్‌ఎస్‌కే లాభం. అలాగే ఆ రెండు పార్టీల్లో నిలకడ లేని నాయకత్వం ఉందనే అంశం హైలైట్ చేయడం..ఇలా కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతూ..మూడోసారి విజయం అందుకోవడమే లక్ష్యంగా దూసుకెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news