ఎమ్మెల్యేలుగా ఎంపీలు..బరిలో ఉండేది వీళ్ళే.!

-

తెలంగాణలో రాజకీయ నాయకులకు అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు వేరు వేరుగా జరగడం ఓ బంపర్ ఆఫర్ లాంటివి అని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ముందు జరుగుతాయి.. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వారు పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారిపోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా గత ఎన్నికల్లో కొంతమంది నేతలు పోటీ చేసి గెలిచారు. కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ గెలిచి సత్తా చాటారు. అధికారంలోకి వచ్చారు.

అప్పుడు ఓటమి పాలైన కొందరు నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి..బి‌జే‌పి నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపురావు లాంటి వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి..పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు. అందులో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా దక్కించుకున్నారు. ఇక ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికలు ముందే జరగనున్నాయి. దీంతో ఎంపీలుగా ఉన్నవారు..ఎమ్మెల్యేలుగా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు.

ఇటు ఖచ్చితంగా కొడంగల్ లో రేవంత్ , హుజూర్‌నగర్ లో ఉత్తమ్, నల్గొండలో కోమటిరెడ్డి పోటీ చేయనున్నారు. అంబర్‌పేటలో కిషన్, కరీంనగర్ అసెంబ్లీలో బండి, బోథ్‌లో బాపురావు పోటీ చేసే ఛాన్స్ ఉంది. అటు బి‌ఆర్‌ఎస్ ఎంపీలు సైతం ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చూస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి..దుబ్బాక లో పోటీ చేయాలని చూస్తున్నారు.

ఇక నాగర్‌కర్నూలు ఎంపీ పి.రాములు సైతం ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత సైతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. అటు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం అసెంబ్లీ సీటులో పోటీకి దిగాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇలా ఎంపీలు..ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news