దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని మార్కెట్ యార్డ్ నందు దివ్యాంగుల పింఛన్లు 3016 నుంచి వె 4016 పెంచిన పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పింఛను వెయ్యి పెంచి 4 016 రూపాయలు ప్రతి దివ్యాంగుడుకి అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఇస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇవ్వటం లేదని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఘనత అని మంత్రి పేర్కొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 స్థానాలు గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇస్తాం అని జగదీష్ రెడ్డి అన్నారు.. సూర్యాపేటలో ఎమ్మెల్యే కిశోర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ,. తెలంగాణలో మూడోసారి కూడా గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా కు సకలజనుల ఆమోదం ఉందన్నారు.