సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని…సెప్టెంబ ర్ 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకోవాలన్నారు. ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంతి సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద నెలకు రూ. 5000 వరకు జీవనభృతి ఇస్తున్నామన్నారు. రోగికి అందించే ఈ సాయాన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఇవ్వాలని ఆదేశించారు. దీనికి కావాల్సిన ఎస్ఓపిని రూపొందించాలని సూచించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి రూ. 5లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు పథకాన్ని వర్తింపచేస్తున్నామన్నారు. రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వైద్య సేవలను పొందడంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆదేశించారు.