ఆన్లైన్లో ఆడినా, ఆఫ్‌లైన్‌లో ఆడినా కార్డ్ గేమ్‌లు పోకర్ మరియు రమ్మీ ‘నైపుణ్యం’ ఆటలేనని ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఢిల్లీ) ప్రొఫెసర్లు తెలిపారు. ప్రొఫెసర్ తపన్ కె. గాంధీ, కాడెన్స్ చైర్ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ తన బృందంతో కలిసి ఇటీవలే పోకర్ మరియు రమ్మీ నైపుణ్యానికి సంబంధించిన ఆటలు అని ధృవీకరిస్తూ విస్తృతమైన అధ్యయనాన్ని నిర్వహించారు.
ఆన్ లైన్ రమ్మీ, పోకర్ లో దీర్ఘకాలం పాటు విజయవంతం కావాలంటే నైపుణ్యంతో పాటు అనుభవం, కిటుకులు వంటబట్టించుకునే సామర్థ్యం కూడా కీలకమని తపన్ కె గాంధీ బృందం వెల్లడించింది. ఆన్ లైన్ లో గానీ, ఆఫ్ లైన్ లో గానీ రమ్మీలో నైపుణ్యానిదే ప్రధాన భూమిక అని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని గణిత విధానాలను ఉపయోగించి, సమగ్ర విశ్లేషణ జరిపింది.