కేటీఆర్ బీజేపీకి పెట్టిన కొత్త పేరు ఇదే… సెటైర్ బాగా పేలింది..

-

తెలంగాణ‌లో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు ముందు వ‌ర‌కు బీజేపీ టీఆర్ఎస్‌ను మామూలుగా టార్గెట్ చేయ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా తెలంగాణ రాజ‌కీయాన్ని హీటెక్కిస్తోన్న బీజేపీకి హుజూర్‌న‌గ‌ర్ ఓట‌ర్లు షాక్ ఇచ్చారు. అక్క‌డ బీజేపీకి వ‌చ్చిన ఓట్లు చూశాక వాళ్ల‌కు దిమ్మ‌తిరిగిపోవ‌డంతో టీఆర్ఎస్ నేత‌లు బీజేపీని ఓ ఆటాడుకుంటున్నారు. ఈ జోష్‌లో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ బీజేపీపై అదిరిపోయే సెటైర్లు వేశారు.

హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణభవన్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ప‌నిచేసిన వారంద‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపిన కేటీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్‌పై ఉన్న అనంత‌మైన విశ్వాసానికి ఈ ఉప ఎన్నిక ఫ‌లితాలే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు.

ఈ ఉప ఎన్నిక ద్వారా ఏ పార్టీ బ‌లం ఎంతో తేలిపోయింద‌ని… చివ‌ర‌కు టీ పీసీసీ అధ్య‌క్షుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించార‌న్నారు. ఇక కొంత కాలంగా టీఆర్ఎస్‌పై బీజేపీ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని… ఆ పార్టీకి అస‌లు తెలంగాణ‌లో సీన్ లేద‌ని హుజూర్‌న‌గ‌ర్ ఓట‌రే తీర్పు ఇచ్చార‌ని ఎద్దేవా చేశారు.

కొంత కాలంగా బీజేపీ చేస్తోన్న హ‌డావిడి అంతా ప‌టాటోప‌మ‌నే తేలిపోయింద‌ని.. బీజేపీ అంటే బిల్డ‌ప్ జ‌న‌తా పార్టీ అని చుర‌క‌లు అంటించారు. ఏదేమైనా మ‌రోసారి కేటీఆర్ బీజేపీని టార్గెట్‌గా చేసుకుని త‌న‌దైన స్టైల్లో సెటైర్లు వేశారు. ఇక కొద్ది రోజులుగా టీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేస్తోన్న బీజేపీ ఇప్పుడు ఆర్టీసీ స‌మ్మెను సైతం త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news