తెలంగాణలో పొత్తుల అంశంపై రకరకాల ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. కమ్యూనిస్టులని కలుపుకునే విషయంలో కాంగ్రెస్ సైతం ఆలోచనలో ఉన్నట్లు ఉంది. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టుల సపోర్ట్ తీసుకున్న కేసిఆర్..ఇప్పుడు వారిని పక్కన పెట్టేశారు. వారితో పొత్తుకు ముందుకు రాలేదు. పైగా కమ్యూనిస్టులు విడిగా పోటీ చేస్తేనే ఓట్లు చీలిపోయి తమకు మేలు జరుగుతుందనే కోణంలోనే కేసిఆర్ ఉన్నారు. అందుకే కమ్యూనిస్టులని సైడ్ చేశారు.
అలా తమని వాడుకుని వదిలేయడంపై కమ్యూనిస్టులు సీరియస్ గా ఉన్నారు. కేసిఆర్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే సిపిఐ, సిపిఎంలు కలిసి పోటీ చేస్తే కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోవడం కష్టమే. ఇదే సమయంలో కాంగ్రెస్ తో కలిస్తే కాస్త బెటర్ అనే ఆలోచన చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ సైతం కమ్యూనిస్టులని సైతం కలుపుకోవాలని చూస్తున్నారు. కాకపోతే వీరికి సీట్ల విషయం సెట్ కావడం లేదు. సిపిఐ, సిపిఎంలు చెరో రెండో సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మాత్రం చెరోక సీటు, నెక్స్ట్ ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది.
దీంతో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు అంశం ఇంకా సీరియల్ మాదిరిగా సాగుతుంది. అయితే కమ్యూనిస్టులకు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో బలం ఉంది. దాదాపు 10 వేల చొప్పున ఓట్లు బ్యాంకు ఉంటుంది. ఇప్పుడు టఫ్ ఫైట్ ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఓట్లు అనేవి బదిలీ కావాలి. అప్పుడే పొత్తు సక్సెస్ అవుతుంది.
అలా అవ్వని పక్షంలో బిఆర్‌ఎస్ పార్టీకి లాభం. గత ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకున్నారు..కానీ టిడిపి ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ కాకుండా బిఆర్‌ఎస్‌కు బదిలీ అయ్యాయి. అటు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ ఓట్లు బదిలీ కాలేదు. ఇలా జరగడం వల్ల పొత్తుకు నష్టం జరిగింది. చూడాలి మరి కాంగ్రెస్-కమ్యూనిస్టుల పొత్తు సెట్ అవుతుందో లేదో.