పిరియడ్స్‌ నెల నెలా ఆలస్యంగా వస్తున్నాయా..? కారణాలు ఇవే..

-

పురుషులకు మానసికంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి, కానీ మహిళలకు వాటితోపాటు.. శారీరకంగా కూడా బోలెడు సమస్యలు ఉంటాయి. అసలు ఈ పిరయడ్స్‌ కాన్సప్ట్‌ వల్ల ప్రతి స్త్రీ ఎన్నో రకాల ఇబ్బందులను ఫేస్‌ చేయాల్సి వస్తుంది. కొందరికి అధికంగా బ్లీడింగ్‌ అయితే, మరికొందరికి అసలే అవదు. కొందరికి టైమ్‌కు డేట్‌ రాదు, పిరియడ్స్‌లో భరించలేని నొప్పులు, మూడ్ స్వింగ్స్‌, ఇలా ఈ ఒక్క పిరియడ్స్‌తోనే మహిళ ఆరోగ్యం ఘోరంగా దెబ్బతింటుంది. మహిళలు మెచ్యూరిటీ పొందినప్పట్నించి తిరిగి 45-50 ఏళ్ల ప్రాయంలో మెనోపాజ్ వరకూ తలెత్తే ఓ ప్రక్రియ నెలసరి. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే పీరియడ్స్ తప్పుతుంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటనేది తెలుసుకుందాం..

పీరియడ్స్ ఆకస్మాత్తుగా ఆగితే సహజంగా ప్రెగ్నెన్సీ లక్షణంగా భావిస్తారు. కానీ చాలా సందర్బాల్లో పీరియడ్స్ రాకపోవడానికి కారణం ఇంకా చాలా ఉన్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇటీవల చిన్న వయస్సు నుంచే పీరియడ్స్ ప్రారంభమౌతున్నాయి.

సాదారణంగా హార్మోన్లలో సమస్య ఉన్నా…హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యత ఏర్పడినా పీరియడ్స్ తప్పుతుంటాయి. బరువు ఆకస్మికంగా పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఇటీవలి కాలంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి అనేది హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంటుంది. జిమ్‌కు ఎక్కువగా వెళ్లేవారిలో కూడా ఈ సమస్య తరచూ కన్పిస్తుంది.

కొంతమందిలో అండాశయం ఫలవంతంగా ఉన్నా సరే..పీరియడ్స్ మిస్ అవుతుంటాయి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

జీవనశైలి వ్యాధుల్లో ఒకటైన థైరాయిడ్ వల్ల మహిళల్లో పీరియడ్స్ సమస్య ఉంటుంది. థైరాయిడ్‌ ఉంటే.. పిరియడ్స్‌ టైమ్‌కు రావు, బ్లీడింగ్‌ కూడా తక్కువగా ఉంటుంది.

ఇటీవలి కాలంలో టీనేజ్ యువత ఎక్కువగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ తింటోంది. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో మెటబోలిజంలో సమస్య ఏర్పడుతుంది. ఇది కాస్తా హార్మోన్ సమస్యకు దారితీయడం వల్ల పీరియడ్స్ మిస్ అవుతుంటాయి.

అంతేకాదు.. మహిళలు త్వరగా రక్తహీనతకు గురవుతారు. బాడీలో రక్తం తక్కువైనా.. పిరియడ్స్‌ ఆలస్యంగా రావడం, బ్లీడింగ్‌ తక్కువగా అవడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news