సైకిల్ ‘యాక్షన్’..బాబు కీ స్టెప్.!

-

జైల్లో ఉన్నా సరే చంద్రబాబు పార్టీని ఎలా ముందుకు నడిపించాలో పూర్తిగా అవగాహనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన జైల్లో ఉంటూనే..రాజకీయంగా టి‌డి‌పి ఎలా ముందుకెళ్లాలి..వైసీపీకి ఎలా చెక్ పెట్టాలనే కోణంలోనే పనిచేస్తున్నారు. ఆయనకు ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు..ఎప్పుడు బయటకొస్తారో తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు మాత్రం ఆగకూడదు.

అందుకే జైల్లో ఉంటూనే..నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లోకేష్, కుటుంబ సభ్యులతో పాటు టి‌డి‌పి నేతలు బాబుని ములాఖత్ లో కలుస్తున్నారు. ఈ క్రమంలో బాబు రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాలో క్లియర్ గా వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇప్పటికే జైల్లోనే టి‌డి‌పి-జనసేన పొత్తు పొడిచింది. పవన్ జైలుకు వెళ్ళి బాబుని కలిసొచ్చి..పొత్తుపై ప్రకటన చేశారు. ఇకపై టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. ఆ తర్వాత యనమల రామకృష్ణుడు సైతం బాబుని వెళ్ళి కలిసొచ్చారు.

ఇటు లోకేష్ రెండుసార్లు బాబుని కలిశారు. ఈ నేపథ్యంలో పార్టీ నడిపించే విషయంలో లోకేష్‌కు బాధ్యతలు ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు 15 మంది సభ్యులతో పోలిటికల్ యాక్షన్ కమిటీ నియమించారు. ఈ కమిటీలో అన్నీ కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కమిటీ ఇప్పుడు టి‌డి‌పి బాధ్యతలు తీసుకుని ముందుకు నడపనుంది.

ఇక నుంచి లోకేష్ పాదయాత్ర కూడా మొదలుకానుంది. అయితే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలిటికల్ యాక్షన్ కమిటీ పార్టీని నడిపించనుంది. బాబు బయటకొచ్చే వరకు పార్టీ బాధ్యతలు వారికే. మరి ఇకపై టి‌డి‌పి రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news