ఈ సారి ఎంపీగా బరిలోకి దిగనున్న జానారెడ్డి

-

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే.. అసంతృప్తిలు లేకుండా.. ఆశావాహులకు అవకాశాలు కల్పించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్టు జానారెడ్డి వెల్లడించారు. తన కుటుంబం నుంచి ఒకరు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారని వివరించారు. ఇవాళ జానారెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఖర్గేతో సమావేశం ముగిసిన తర్వాత జానారెడ్డి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేదీ జానారెడ్డి వెల్లడించలేదు. జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం.

Jana Reddy paves way for sons to contest in next polls in Telangana

అటు, మరో సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కూడా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎంపీగా పనిచేసిన
మధుయాష్కీ గౌడ్ ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇంకా ఖరారు కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news