చిన్నపిల్లలో ఐరన్‌ లోపం జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది, నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకే ప్రమాదం

-

చిన్నపిల్లలకు ఐరన్‌ చాలా అవసరం. ఐరన్ ఊపిరితిత్తుల నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి సహాయపడుతుంది. అయితే చిన్నపిల్లలకు జ్ఞాపకశక్తి లోపించడానికి ఐరన్‌ లోపం కూడా ప్రధాన కారణం అని చాలా మందికి తెలియదు. చిన్నప్పుడే ఐరన్ లోపం భారిన పడితే వారు పెద్దయ్యేసరికి చాలా డమ్‌గా, లేజీగా ఉంటారు. సరిగ్గా చదువుకోలేరు. పిల్లలు జ్వరంతో పాటు రక్తహీనత సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఐరన్ హిమోగ్లోబిన్ యొక్క ముఖ్యమైన భాగం. ఇది అనేక సెల్యులార్ ప్రక్రియలలో పాల్గొంటుంది. ఐరన్ లోపం ఉన్న పిల్లలకు జ్ఞాపకశక్తి సమస్యలు మరియు ప్రవర్తనా సమస్యలు ఉంటాయి. ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు ఐరన్‌ లోపం భారిన పడుతున్నారు. పిల్లలలో ఇనుము లోపం అనీమియా కొన్నిసార్లు త్వరగా బయటపడదు. ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొన్నిసార్లు 3-4 gm/dl కంటే తక్కువ హిమోగ్లోబిన్‌తో తీవ్రమైన రక్తహీనత గుండెపోటుకు దారితీస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనతతోపాటు పక్షవాతం కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఐరన్‌ లోపం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?:

నెలలు నిండకుండా లేదా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు.
1 సంవత్సరం లోపు ఆవు పాలు లేదా మేక పాలు తాగే పిల్లలు.
6 నెలల వయస్సు తర్వాత ఇనుముతో కూడిన పరిపూరకరమైన ఆహారాన్ని తీసుకోని శిశువులు.
దీర్ఘకాలిక అంటువ్యాధులు లేదా నియంత్రిత ఆహారం వంటి కొన్ని ఆరోగ్య సమస్యల భారిన పడ్డ పిల్లలకు.
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న పిల్లలు.

పిల్లలలో ఐరన్‌ లోపం యొక్క లక్షణాలు ఏమిటి?:

సన్నని చర్మం.
అలసట.
చేతులు, కాళ్లు చల్లగా ఉండటం.
పెరుగుదల నెమ్మదిగా ఉండటం
ఆకలిగా లేకపోవడం.
అసాధారణంగా బిగ్గరగా శ్వాస తీసుకోవడం.
ప్రవర్తనా సమస్యలు.
ఇన్ఫెక్షన్‌ను తరచుగా గురవ్వడం.

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే వారు ఐరన్‌ లోపానికి గురైనట్లే.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. చిన్నపిల్లల విషయంలో సొంత వైద్యం అంత మంచిది కాదు. వైద్యుల సలహా మేరకే వారికి కావాల్సిన ఆహారం ఇవ్వాలి.

Read more RELATED
Recommended to you

Latest news