కరెంటు కష్టాలపై మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌, బీజేజీలపై సెటైర్‌

-

కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్న అధికారులపై ఆగ్రహంతో రైతన్నలు ఏకంగా సబ్‌స్టేషన్‌కు మొసలిని పట్టుకొచ్చారు. మాకు కరెంటు ఇస్తారా? మొసలిని సబ్‌స్టేషన్‌లో వదలాలా అంటూ నిలదీశారు.

KTR seeks apology from PM Modi

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రమంత్రి కేటీఆర్‌ కూడా ఈ వీడియోను రీట్వీట్‌ చేశారు. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ సెటైర్‌ వేశారు. ఈ దిక్కుమాలిన పండుగలను తెలంగాణకు తీసుకురాకుండా కాంగ్రెస్‌, బీజేపీలను తరిమికొడదామని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. కరెంటు లేక జిరాక్స్‌ సెంటర్‌ దగ్గర రెండు గంటలు కరెంటు కోసం నిలబడిన రోజులు మళ్లీ వస్తాయోమో అని ఇంకో నెటిజన్‌.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కటిక చీకట్లే అని మరో నెటిజన్‌ కామెంట్లు పెట్టారు.

వాస్తవానికి బీజేపీ పాలనతో విసిగి వేసారిపోయిన కర్నాటక రైతులు ఈసారి హంగ్ కి ఛాన్స్ లేకుండా కాంగ్రెస్ కి పట్టం కట్టారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ కూడా భారీగా హామీలు గుప్పించింది. అయితే వాటి అమలులో మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా రైతులకు ఎనిమిది గంటల కరెంటు హామీని నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్, అధికారికంగా 5 గంటలు ఇస్తామన్నా.. అదీ సాధ్యం కావడంలేదు. దీంతో కర్నాటక రైతాంగం ఇబ్బంది పడుతోంది. ఒకరకంగా కాంగ్రెస్ మోసపు హామీలను నమ్మి ఓటు వేసినందుకు ఈ మొసళ్ల పండగను వారు ఊహించలేకపోయినట్టే లెక్క.

 

 

Read more RELATED
Recommended to you

Latest news