సీఎం జగన్ రాజకీయ చతురతకు సీనియర్లు సైతం తోక ముడవాల్సిన పరిస్థితి.. కాకలు తీరిన సీనియర్లు సైతం జగన్ దెబ్బ అదుర్స్ అని మాట్లాడుకోవాల్సిందే.. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే.. నిన్న మొన్నటి వరకు సీఎం జగన్ మీద మంత్రుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఈ మధ్యకాలంలో సైలెంట్ అయ్యారట.. అధికార వైసీపీ నుంచి తనకు పోటీనే లేరని ప్రచారం చేసుకుంటున్నా ఆయన జగన్ వ్యూహాలకు చిత్తయ్యారని టిడిపిలో చర్చ నడుస్తోంది..
గత ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో టిడిపి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు, ఓవరాక్షన్ వార్తల్లో ఉండేలా చేస్తాయి.. అయితే స్వామికి చెక్ పెట్టాలని భావించిన సీఎం వైఎస్ జగన్ ఇటీవల వస్త్రాన్ని ప్రయోగించారట.. నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుల్లో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండపి నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు..
దీంతో సురేష్ వివాద రహితుడుగా.. ప్రజల్లో మంచి ఇమేజ్ ఉండడంతో ఆయనకు నియోజకవర్గ ప్రజలు జేజేలు పలుకుతున్నారు.. నిన్న మొన్నటి వరకు తనకు తిరుగులేదని ప్రకటనలు చేసుకుంటున్న వీరాంజనేయ స్వామికి మంత్రి సురేష్ ఒక్కసారిగా చెక్ పెట్టడంతో దిక్కు తోచని స్థితిలో టిడిపి ఎమ్మెల్యే స్వామి ఉన్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు..
వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అని అనుమానంగా ఉన్న వీరాంజనేయ స్వామికి.. మంత్రి సురేష్ దూకుడు చూసి టికెట్ ఇచ్చిన గెలుపు కష్టమనే భావన లోకి వచ్చారట.. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో తనకు తిరుగులేదని ఎగిరెగిరి పడుతున్న వీరాంజనేయ స్వామి.. మంత్రి సురేష్ దెబ్బకు సైలెంట్ అయ్యారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది..