సంక్రాంతి నాడు గాలిపటాలను ఎందుకు ఎగుర వేస్తారు.. ఆచారమే కాదు ఆరోగ్యం కూడా..!

-

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల లో సంక్రాంతి కూడా ఒకటి. సంక్రాంతి నాడు దూర దూర ప్రాంతాల లో ఉండే వాళ్ళందరూ కూడా సొంత ఊర్లకు వచ్చి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. పిల్లల తో మనవళ్ల తో తల్లిదండ్రులు సంతోషంగా ఈ మూడు రోజులు గడుపుతారు మళ్ళీ మూడు రోజులయ్యాక మళ్ళీ మామూలే అది వేరే విషయం.

సంక్రాంతి ని వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరు పద్ధతుల్లో జరుపుతూ ఉంటారు తెలుగు రాష్ట్రాలలో చాలా అందంగా జరుపుతారు, సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలని కూడా ఎగరేస్తారు అలానే సంక్రాంతి పండగ గురించి చెప్తూ వెళితే చాలా ఉంది..

హరిదాసు గీతాలు, సంక్రాంతి ముగ్గులు, బసవన్నలు ఇలా చాలా… అయితే గాలిపటాలని సంక్రాంతి వేళ ఎదురు వేయడానికి కారణం ఉంది. మనం మామూలుగా మన పూర్వీకులు అనుసరించారని మనం కూడా పాటిస్తూ ఉంటాం అలానే పిల్లలు సరదా కొద్దీ గాలి పటాలని ఎగురవేస్తూ వుంటారు. అయితే గాలిపటాలని ఎగరవేయడానికి కారణం కూడా ఉంది గాలిపటాలని ఎగరవేయడానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరాముడు వలనే:

శ్రీరాముడు మకర సంక్రాంతి నాడు గాలిపటాన్ని ఆకాశంలోకి ఎగురవేస్తాడు/ ఆ గాలిపటం కాస్త ఇంద్రలోకానికి వెళుతుంది అప్పటి నుండి కూడా గాలిపటాలని ఎగరవేయడం మన ఆచారంగా వచ్చింది.

గాలిపటాలని ఎగురవేయడం ఔషధమే..

సూర్యోదయం వేళ సూర్యాస్తమయం వేళ గాలిపటాలని ఎగరు వేయడం వలన సూర్యకిరణాలు మన శరీరానికి తాకి ఔషధంలా పని చేస్తాయి ఇలా గాలిపటాలని ఎగరవేయడం వలన మనం ఈ లాభాన్ని కూడా పొందొచ్చు. ఆచారమే కాదు ఆరోగ్యం కూడా.

Read more RELATED
Recommended to you

Latest news