హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా భార్య బతికి ఉండగానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్నాడు అమరేందర్. హై కోర్ట్ లో న్యాయవాది గా చలామణి అవుతున్నాడు అమరేందర్. ఆడపిల్లలే పడుతున్నారని భార్య కు 4 సార్లు అబార్షన్ చేయించాడు ఈ ప్రబుద్ధుడు. బాధితురాలికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇల్లీగల్ గా స్కాయింగ్ చేసి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే 4 సార్లు అబార్షన్ చేయించాడు అమరేందర్.
భార్య బతికి ఉన్నా..చనిపోయిందని వేరే పెళ్లి చేసుకున్నాడు అమరేందర్. Trs brs గా మారిన తరువాత తెలంగాణ రైతు రాజ్య సమితి (TRS) ను రిజిస్టర్ చేసుకున్నాడు అమరేందర్. అమరేందర్ తండ్రి రిటైర్డ్ మెజిస్ట్రేట్ అంటూ పలువురిని మోసం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. ఇప్పటికే సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో అమరేందర్ పై కేస్ నమోదు అయింది. అమరేందర్ బారిన పడ్డ పలువురు బాధితులు ఒక్కొక్కరుగా ఉమెన్స్ పీఎస్ కి చేరుకుంటున్నారు. ాతమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు.