ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపై అవగాహన లేదు : జగదీశ్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. సాగునీళ్లు లేక లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మాత్రం రైతులను, వాళ్ల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం పిల్లర్ల పేరుతో ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 100 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆరోపించారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి రంగంపై పరిజ్ఞానం లేదన్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి ఏమి తెలియనట్టు నడిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆధారాలు ఉన్నాయని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news