అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లు అయినా పట్టుకుంటాడు : కొడాలి నాని

-

అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లెనా పట్టుకుంటాడు అని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. పదిమంది జనసేనలకు తప్ప..ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు అన్నారు.  జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు అన్నారు. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు కొడాలి నాని.


ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కాళ్లు పట్టుకున్నాడు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడని చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడు. వాలంటీర్ల పై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకం అన్నారు. వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు.  వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తోంది.  వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు అన్నారు.  ఐదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ అవమానకరంగా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news