అమిత్ షా కు ట్వీట్ తో కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

-

ktr strong reply to amit shah tweet against trs government

‘ఆయుష్మాన్‌ భారత్‌’  జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని పొగుడుతూ.. భాజపా అధ్యక్షుడు  అమిత్ షా తెలంగాణలో అమలవుతున్న ఆరోశ్రీ పథకం పై చేసిన విమర్శలపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. అమిత్ షా గారు మీకు తప్పుడు సమాచారం అందింది. తెలంగాణలో అమల్లో ఉన్న ఆరోగ్య శ్రీ పథకం వల్ల 80 లక్షల మందికి మేలు జరుగుతోంది. కానీ ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల తెలంగాణలో కేవలం 25 లక్షల మందికే లబ్ది చేకూరుతుంది.. యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌లో తెలంగాణ రాష్ట్రం ఓ రోల్ మోడల్‌గా ఉంది’అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని  ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితమే ప్రారంభించిన విషయం తెలిసిందే.  దీని ద్వారా దేశ వ్యాప్తంగా  10 కోట్ల కుటుంబాలకు లబ్దికలుగుతుందని అంచనా వేస్తున్న విషయం తెలిసిందే. అయితే వాస్తవాలు తెలుసుకోకుండా అమిత్ షా చేసిన ట్వీట్ కి కేటీఆర్ కౌంటర్ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news