వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని బతికి బట్ట కట్టిన వారు ఎవడూ లేడు : అచ్చెన్నాయుడు

-

మేం అధికారం చేపట్టిన నాటికి ఉద్యోగులుకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. అయినా ఏ పథకాలు ఆపడం లేదు అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వాలంటీర్లు లేరు.. సచివాలయ ఉద్యోగులతోనే కార్యక్రమాలు చెపడుతున్నాం. అర్హత లేని వారు అనేక మంది పథకాలు పొందుతున్నారు… వారిని కట్టడి చేస్తాం. అర్హత ఉన్నవారికి అందరికి పథకాలు ఇస్తాం. ప్రస్తుతం పథకాలు ఓక్కోక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. కక్ష్య సాదింపులు, తప్పుడు కేసులు పెట్టడం మాప్రభుత్వంలో ఉండవు అని అన్నారు.

అలాగే దుర్మార్గులు కి దేవుడంటే భయం లేదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత ను నాశనం చేసారు. ఐదేళ్లైంది లడ్డులో వాసనే లేదు. జంతువుల అవశేషాల ఉన్న నూనె నెయ్యిలో కలిపారు. పదిరోజుల నుండి నిద్రలేదు. అప్పటి ముఖ్యమంత్రికి బుర్ర లేదా.. 320 కి కేజి నెయ్యి ఏంటి? చంద్రబాబు ప్రశ్నిస్తే… సిగ్గుపడాల్సింది పోయి.. ఎదురుదాడి చేస్తారా మేం చెప్పింది కాదు ల్యాబులు చెప్పాయి అవి మంచి నెయ్యి కాదని. అయినా పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుని బతికి బట్ట కట్టిన వారు ఎవడూ లేడు అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news