ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఉద్యమం విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జాతియ స్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటుగా వారిని కాళ్ళతో తన్నడం, ఇబ్బందులు పెట్టడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలకు పోలీసులు దిగారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అరెస్టలతో అమరావతి ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేసారు. ఆందోళన చేస్తున్న రైతులను టెర్రరిస్టులుగా చూస్తున్నారని, అందుకే అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని, చట్టాలను పట్టించుకోవటం లేదన్నారు.
తీవ్రవాదులతో వ్యవహరించినట్లు రైతులతో వ్యవహరిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై జరిగిన దాడిని కేంద్ర మహిళా కమిషన్‌కు వివరిస్తామని చెప్పిన ఆయన మూడు రాజధానుల గురించి మాట్లాడుతూ, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు ఇచ్చే టీఏ, డీఏలకే రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందని ఎద్దేవా చేసారు. రైతుల ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు.