చంద్రబాబు, లోకేష్ మూల్యం చెల్లించుకోకతప్పదు : అంబటి

-

సజ్జల భార్గవ్ రెడ్డి డ్రైవర్ పై జరిగిన దాడి పై కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. యామర్తి సుబ్బారావు సజ్జల భార్గవ్ రెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా యామర్తి సుబ్బారావు పై తప్పుడు కేసులు పెట్టి ఇరికించాలని చూస్తున్నారు. సుబ్బారావును నిన్న ఉదయం మఫ్టీలో పోలీసులు తీసుకెళ్లారు. సజ్జల భార్గవ్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ విజయవాడలోని ఓ అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లారు. మొహానికి మంకీ క్యాప్ తొడిగి తీసుకెళ్లారు. ఓ గదిలో ఉంచి సుబ్బారావును చిత్రహింసలకు గురిచేశారు. దారుణంగా కొట్టి గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ వద్ద వదిలేశారు.

సజ్జల భార్గవ్ ను విచారణ చేయొచ్చు తప్పులేదు. కానీ బ్రతుకుదెరువు కోసం డ్రైవింగ్ చేసుకుంటున్న సుబ్బారావును దారుణంగా కొట్టారు. సుబ్బారావు పై దాడి విషయమై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాం. దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసుల పై కమిషనర్ చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు పోతాం. విచారణకు హాజరు కావాలని నోటీసులివ్వొచ్చు. కానీ ఇలా చిత్రహింసలకు గురిచేయడం దుర్మార్గం. వైసీపీ కార్యకర్తలు,సోషల్ మీడియా కార్యకర్తలను కేసుల్లో ఇరికించి హింసిస్తున్నారు. మాపై పెట్టిన తప్పుడు కేసుల పై పోరాడుతున్నాం. కానీ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నందుకు చంద్రబాబు,రెడ్ బుక్ అధినేత లోకేష్ మూల్యం చెల్లించుకోకతప్పదు అని అంబటి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news