బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీకి కొత్త అర్థాన్ని వివరించారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు.. భారత రైతు సమితి కూడా అని వెల్లడించారు. బుధవారం బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ సమావేశం అయింది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
రైతుల కష్టాలు తెలుసుకొని, రైతులకు ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేశారు కేసీఆర్ అని తెలిపారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఈ నెల 24 తేదీ నుంచి నెల రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలోని రైతులను కలిసి రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ఎరువుల కేంద్రాలు గురించి ఇబ్బందులను తెలుసుకొనున్నది ఈ కమిటీ. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి, రైతుల తరపున పోరాటం చేస్తామని తెలిపారు.