వైయస్ వివేకానంద రెడ్డిని 2019 మార్చి 15 న దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన తర్వాత ప్రశ్నించడానికి పోలీసులు కొద్దిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం పర్యవేక్షిస్తుంది. 2019 ఎన్నికల ప్రచారం ముందు జరిగిన ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో కలచివేసింది.
అప్పట్లో ప్రతిపక్షంలో వైయస్ జగన్ ఉన్న క్రమంలో సరిగ్గా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టే సమయంలో ఈ హత్య జరగటంతో కావాలని వైయస్ జగన్ సానుభూతి రాజకీయాలు చేయాలని సొంత బాబాయిని చంపించడం జరిగిందని అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో వైసిపి పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ పని అని వైయస్ వివేకానంద రెడ్డి బతికి ఉంటే కడపలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగర లేదని భావించి స్కెచ్ వేసి చంపటం జరిగిందని ఆరోపించడం జరిగింది.
అయితే ఆ తర్వాత ఎన్నికలు జరగడం జగన్ ముఖ్యమంత్రి కావడంతో వివేక హత్య కేసు విషయం ఓ కొలిక్కి వస్తుందని అందరూ భావించిన తరుణంలో కేసు నత్తనడకన లేటుగా సాగుతుండటంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇటీవల ఈ కేసును సిబిఐకి అప్పగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా కేసు విషయంలో లేట్ చేయకుండా సిబిఐకి అప్పగించాలని జగన్ కూడా ఆలోచించినట్లు పార్టీలో మాటలు వినబడుతున్నాయి.