ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్, స్పందించిన కియా…!

-

ఆంధ్రప్రదేశ్ నుంచి కియా పరిశ్రమ వెళ్లిపోతుంది అనే ప్రచారంపై కియా ఎండీ స్పందించారు. అసలు కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుందని, అనంతపురంలోనే కొనసాగిస్తామని స్పష్టం చేసారు. ఆ ప్రచారంలోనే నిజం లేదని స్పష్టం చేసారు. అనంతపురం ఫ్యాక్టరీ నుంచే ప్రపంచ స్థాయి కంపెనేలను తయారు చేస్తామని అన్నారు. అసలు ఆ ప్రచారం నమ్మవద్దని ఎండీ కోరారు. దీనితో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ దీనిపై కథనం ప్రచురించడంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా కియా కార్ల కంపెనీ తమిళనాడు వెళ్లిపోతుంది అనే ప్రచారం జరిగింది. ఇది ఒక్కసారిగా రాజకీయ దుమారం రేపింది. విపక్ష తెలుగుదేశం దీనిపై ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం అసలు కంపెనీ ఎక్కడికి వెళ్ళడం లేదని, ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుందని వారికి తమ సహకారం అందిస్తున్నామని స్పష్టం చేసింది.

తాజాగా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కూడా దీనిపై స్పందించారు. కియా కంపెనీ ఎక్కడికి వెళ్ళడం లేదని ఆయన స్పష్టం చేసారు. కియా పరిశ్రమపై అవస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక పార్లమెంట్ లో కూడా దీనిపై దుమారం రేగింది. టీడీపీ ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించగా జోక్యం చేసుకున్న వైసీపీ ఎంపీలు అది తప్పుడు ప్రచారమని కంపెనీ ఎక్కడికి వెళ్ళడం లేదని స్పష్టం చేసారు. ఇక కియానే స్పందించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news