ఇండియాలో ట్రంప్ స్వాగతానికి మొన్న 70 లక్షలు.. నేడు కోటి.. అంత లేదంటున్న నెటిజన్లు..!

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన భాగంగా ఈ నెల 24న సతీసమేతంగా భారత్‌కు రానున్న సంగ‌తి తెలిసిందే. అయితే ట్రంప్ భారత పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 24, 25వ తేదీల్లో.. మొత్తం మూడు దశల్లో అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీని ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. భారత పర్యటన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. 70 లక్షల మందితో మోదీ తనకు స్వాగతం పలకబోతున్నారని ఇటీవల చెప్పిన ట్రంప్.. ఇప్పుడా సంఖ్యను ఏకంగా కోటికి పెంచేశారు. తనకు కోటిమందితో స్వాగతం పలకబోతున్న విషయాన్ని స్వయంగా మోదీయే తనకు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.

 

 

తాజాగా కొలరాడో సభలో ట్రంప్ మాట్లాడుతూ.. మొతేరా స్టేడియానికి వెళ్లే 22 కిలోమీటర్ల దారి పొడవునా కోటిమంది తనకు స్వాగతం పలకబోతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కోటి మంది హాజరయ్యే కార్యక్రమం చూసిన తర్వాత 60 వేల మంది హాజరయ్యే సభలు తనకు సంతృప్తి ఇవ్వలేవని, ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం ఒకరకంగా తనను చెడగొడుతుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ స్టేట్‌మెంట్‌పై నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా కోటిమంది హాజరైన సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నారు. మరోవైపు, మోదీ-ట్రంప్ రోడ్డు షోకు రెండు లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news