అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. తన భార్య మెలానియా ట్రంప్ తో కలిసి ఆయన ఆశ్రమంలో ఉన్న పలు విశేషాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఘన స్వాగతం పలికారు. ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత బయట సందర్శకులు కూర్చునే కూర్చిలో ట్రంప్ తన భార్యతో కలిసి ఆశీనులు అయ్యారు.
ఆ తర్వాత తన భార్యతో కలిసి ఆశ్రమం లోపలోకి వెళ్ళారు ట్రంప్. ఈ సందర్భంగా మోడీ తో కలిసి గాంధీ ఫోటో కి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత చరఖా పని తీరుని మోడీ సహా అక్కడ ఉన్న సహాయకులను అడిగి తెలుసుకున్నారు ట్రంప్. ట్రంప్, మెలానియా ఇద్దరూ ఆసక్తిగా తిలకించారు. చరఖా పని తీరుని చూసి ఆశ్చర్యపోయారు ట్రంప్. దాదాపు 5 నిమిషాల పాటు అక్కడే గడిపారు.
ఆ తర్వాత బయటకు వచ్చిన కాసేపు అక్కడ ఉన్న అరుగు మీద సేద తీరి ప్రధాని నరేంద్ర మోడీ తో ముచ్చటించారు. అలాగే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే కోతి బొమ్మల గురించి మోడీ ట్రంప్ కి వివరించారు. అనంతరం అక్కడ సందర్శకుల పుస్తకంలో తన సంతకం తో పాటుగా అభిప్రాయ౦ రాసారు ట్రంప్. ఇక అక్కడి నుంచి తన భార్యతో కలిసి ఆయన మోతెరా స్టేడియానికి వెళ్ళారు.