ఈ సారి పొలిటకల్ బ్యాగ్డ్రాప్ ..స్పీడ్ గా కంప్లీట్ చేస్తాడనే పూరి జగన్నాధ్ కి ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..!

-

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అన్న పేరు ఒక్క పూరి జగన్నాధ్ కే ఉంది. ఆయన దర్శకుడిగా పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన బద్రి రికార్డ్స్ ని క్రియోట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలవగా పూరి జగన్నాధ్ కి డెబ్యూ మూవీగా మంచి బ్రేక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అలానే చూపించి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ ల మోత మోగించాడు పూరి జగన్నాధ్. ఇక కొంత లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కెమరా మాన్ గంగతో రాంబాబు సినిమా కూడా మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకుంది. అయితే అప్పటి నుంచి మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది ఇన్నాళ్ళకి సాధ్యమవబోతుందని తాజా సమాచారం.

 

రెండేళ్ళ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తుంటే రెండే సినిమాలు చేసి ఊరుకుంటాడని అందరూ అనుకున్నారు. కాని పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో ఆగకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 3 సినిమాల్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. త్వరలోనే మరో 2 సినిమాలకి సంబంధించిన అధికారక ప్రకటనలు రాబోతున్నాయని తెలుస్తోంది. గీతాఆర్ట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్ హారిక-హాసిని సంస్థ తో కలిసి అల్లు అరవింద్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమాతో పాటే పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రాబోతోందని… ఇప్పటికే పవన్ కళ్యాణ్-పూరి జగన్నాధ్ మధ్య కథాచర్చలు జరిగాయని తెలుస్తోంది. చాలా ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ చేస్తాడనే ఒకే ఒక్క కారణంతో.. పూరి జగన్నాధ్ కి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ప్రకటన రాబోతోందట. ఈ హ్యాట్రిక్ మూవీ పై అనౌన్స్ మెంట్ వచ్చిందంటే మాత్రం ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news