ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు, స్థానిక నాయకులకు ,నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న వారికి హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా పడ్డాయి కాబట్టి ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని అలసత్వం ప్రదర్శిస్తే అది కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందని ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఎప్పటికప్పుడు కనిపెట్టి ఉండాలని అదేవిధంగా నియోజకవర్గాల్లో వాళ్ళు ఉన్నారా లేక ఎక్కడికైనా వెళ్తున్నారా అనేది కూడా ఆరా తీస్తే మంచిది అని మంత్రులకు జగన్ సూచించారట.
నియోజకవర్గాల్లో స్థానిక నాయకులను, ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. వాళ్లను ఏమాత్రం లైట్ తీసుకోవద్దని జగన్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. కొంతమంది తెలుగుదేశం పార్టీ తో టచ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏ మాత్రం మనం లైట్ తీసుకోవడం మంచిది కాదని జగన్ అన్నారట. ఆ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారట. ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది కాబట్టి, జాగ్రత్తగా ఉంటే మంచిది అని జగన్ వారికి సూచించారట. ఇటీవల కొందరు కీలక మంత్రులతో సమావేశమైన జగన్ ఇన్చార్జ్ మంత్రులు కీలక బాధ్యతలు అప్పగించారు.
మంత్రులు తమ సొంత జిల్లాలో కంటే తమకు బాధ్యతలు అప్పగించిన జిల్లాలోనే ఎక్కువగా ఉండాలని అక్కడి నాయకులతో అలాగే ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలని జగన్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఈ ఎన్నికలు అయ్యే వరకు ఎవరిని నియోజకవర్గం దాటి వెళ్ళకుండా చూడాలని జగన్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నారు.