దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలకు మొత్తం 72 కేంద్రాలు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 6 ప్రైవేటు ల్యాబ్‌లకు ఇటీవల కరోనా టెస్టులకు అనుమతినిచ్చారు. ఇక మంగళవారం మరో 10 ప్రైవేటు ల్యాబులకు కరోనా టెస్టులకు అనుమతినిచ్చారు. దీంతో దేశంలో కరోనా టెస్టులకు అనుమతి ఉన్న ప్రైవేటు ల్యాబ్‌ల సంఖ్య ప్రస్తుతం 16కు చేరుకుంది. ఇక ఈ ల్యాబ్‌లలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజల నుంచి ఫీజులను వసూలు చేయాల్సి ఉంటుంది.
కరోనా టెస్టుల కోసం ఢిల్లీలో 3, గుజరాత్‌లో 2, హర్యానాలో 2, కర్ణాటకలో 1, మహారాష్ట్రలో 5, తమిళనాడులో 2, తెలంగాణలో 1 ప్రైవేటు ల్యాబ్‌కు కరోనా టెస్టులకు ప్రస్తుతం అనుమతి ఉంది. తెలంగాణలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లోనూ ప్రస్తుతం కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వివరాలను వెల్లడించింది.
ఇక ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా టెస్టులకు గాను ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలోనే ఫీజును వసూలు చేయాల్సి ఉంటుంది. కరోనా స్క్రీనింగ్ కోసం రూ.1500, నిర్దారణ పరీక్షకు రూ.3వేలు మొత్తం కలిపి రూ.4500 కు మించి కరోనా పరీక్షలకు వసూలు చేయరాదు. ఈ నిబంధనను పాటించని ల్యాబ్‌లపై చర్యలు తీసుకుంటామని ఐసీఎంఆర్ తెలిపింది. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,81,739కి చేరుకోగా, 16,558 మంది చనిపోయారు. ఇక భారత్‌లో 500 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా మొత్తం 10 మంది కరోనా కారణంగా చనిపోయారు.