భారతీయులు జాగ్రత్త…!

-

భారత దేశంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఊహకు కూడా అందని విధంగా నిపుణుల అంచనాకు కూడా అందని విధంగా కరోనా వైరస్ విస్తరిస్తుంది. మన దేశంలో రెండు రోజుల్లో దాదాపు 300లకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉంటున్నా…

కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. మన దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తుంది. కాని ఈ లాక్ డౌన్ ని ప్రజలు మాత్రం సమర్ధవంతంగా అమలు చేయడం లేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. దేశంలో కరోనా కేసులు వెయ్యికి దగ్గరలో ఉన్నాయి. మరణాలు 20 వరకు ఉన్నాయి ఇప్పుడు.

కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. తెలంగాణాలో 60కి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏ రాష్ట్రం తీసుకొని విధంగా కరోనా వైరస్ విషయంలో తెలంగాణా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా సరే అది మాత్రం అదుపులోకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి ప్రతీ ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news