జగన్ ముందు ఉన్న పెద్ద సవాల్ ఇదే…

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు ఇప్పుడు పెద్ద సవాల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఇప్పుడు తీవ్రత పెంచుకుంటుంది. నిదానంగా కేసులు పెరుగుతున్నాయి. దీనితో రాష్ట్రంలో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ లాక్ డౌన్ అమలు అవుతుంది. దీనితో ఆదాయ మార్గాలు అనేవి రాష్ట్రానికి రావడానికి ఒక్కటి కూడా లేకుండా పోయింది, ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి ఆదాయ మార్గాలు తక్కువ. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులతో ఏపీ ఇబ్బంది పడుతుంది. అయితే జగన్ వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలతో ఏపీ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కరోనా రూపంలో జగన్ సర్కార్ కి పెద్ద సవాల్ వచ్చి పడింది. దీనిని ఎదుర్కోవడం రాష్ట్రానికి సవాల్ గా మారింది. ఆర్ధికంగా ఇప్పుడు ప్రజలను ఆదుకోవడం తో పాటుగా వారికి సహాయం చెయ్యాల్సి ఉంది.

నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో అందించకపోతే మాత్రం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఆదాయం అనేది దాదాపుగా లేదు. భారీగా ఇప్పుడు ప్రజల కోసం ఖర్చు చెయ్యాల్సిన తరుణ౦. కేంద్రమే విరాళాలు ఇవ్వాలని కోరుతుంది. దీనితో ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కరోనా తగ్గితే మినహా రాష్ట్రంలో ఏదైనా ఒక రూపాయి కనపడుతుంది.

ఉద్యోగులుకు ఇచ్చే  జీతాల నుంచి పెన్షన్ ల వరకు ప్రతీ ఒక్కటి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెను సవాల్ గా మారింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు వెళ్ళాలి అని చూస్తుంది. సంక్షేమ కార్యక్రమాల కోసం భారీగా అప్పులు చేసింది. దీనితో ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కూడా దాదాపుగా లేదని అంటున్నారు. మరి దీని నుంచి ఏపీ ఏ విధంగా బయటపడుతుందో చూడాలి. దీనిని ఎదుర్కొంటే మాత్రం జగన్ కి తిరుగు ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news