మాస్ మహారాజా రవితేజ కి డ్యూయల్ రోల్ హిట్ ఇస్తుందా ..?

-

మాస్ మహారాజా రవితేజ ఆ మధ్య సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఒక్క రాజా ది గ్రేట్ మాత్రమే హిట్ అయింది. ఈ సినిమానే రవితేజ అకౌంట్ లో పడ్డ సక్సస్ మూవి. అంతే ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఈ మాస్ హీరో కి ఒక్క హిట్ సినిమా దక్కలేదు. నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా ఇలా వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు గాని హిట్స్ మాత్రం దక్కడం లేదు.

 

ఇక రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాన్‌ శీను, బలుపు వంటి సినిమాలతో రవితేజ కి హిట్స్ ఇచ్చిన గోపిచంద్‌ మలినేనిలు హ్యాట్రిక్‌ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా హిట్ అన్నది రవితేజ కి, గోపిచంద్‌ మలినేని, శృతిహాసన్ లకి చాలా కీలకం అని చెప్పాలి. ఇక శృతిహాసన్ చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది.

ఇక ఈ తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడట. ఇక తాజా సమాచారం ప్రకారం రవితేజ నటిస్తున్న ఈ రెండు పాత్రల్లో ఒకటి చార్టర్డ్ అకౌంటెంట్ కాగా మరోటి బిజినెస్ మాన్ పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక శర్మను నటిస్తున్నారట. ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. అయితే రవితేజ కి వరుసగా ఫ్లాప్స్ వస్తున్న నేపథ్యం లో మళ్ళీ డ్యూయల్ రోల్ లాంటి ఎక్స్‌పరిమెంట్స్ అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news