విజయవాడ లో సింగం .. పోలీస్ అంటే ఇలా ఉండాలి మరి !

-

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి గట్టిగా కృషి చేస్తున్నారు. ఓపికతో కుటుంబాలను వదిలి రేయి పగలు విధులు నిర్వహిస్తున్నారు. అయినా గాని కొంతమంది ఆకతాయిలు కుంటి సాకులు చెబుతూ రోడ్లపైకి వస్తూ పోలీసులకు విసుగు తెప్పిస్తున్నారు. ఈ విధంగా ఎక్కువగా విజయవాడలో ఆకతాయిలు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న నేపథ్యంలో సింగం తరహాలో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.రాజకీయ నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన విజయవాడ సీపీ..?ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి కారణం లేకుండా రోడ్లపైకి వచ్చి ఆకతాయిలను అదుపులోకి తీసుకోవాలంటే పోలీసులకు అరగంట చాలు. అటువంటి శక్తి సామర్ధ్యాలు పోలీస్ శాఖ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఇటువంటి ప్రమాదకరమైన సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పోలీస్ తన పని తాను చేయాల్సి వస్తుందని ఘాటుగా మాట్లాడారు. ప్రజలకే కాదు రాజకీయ నాయకులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. కనీస దూరం పాటించకుండా జనాన్ని వేసుకుని తిరిగే రాజకీయ నాయకుల పై కూడా కేసులు పెట్టడానికి వెనుకాడబోమని విజయవాడ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల శాంతి స్వభావం ఆసరాగా చేసుకుని చులకనగా భావిస్తే తర్వాత చర్యలు ఊహించని విధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు.

 

కాబట్టి నగర ప్రజలను ఇంటిపట్టునే ఉండి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి పేర్కొన్నారు. ఇక విజయవాడ నగరంలో నమోదైన పాజిటివ్ కేసులు గురించి వివరించారు. దీంతో చాలామంది విజయవాడ నగర వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోలీస్ అంటే ద్వారకా తిరుమల రావు లాగా ఉండాలి ఆయన చెప్పిందే రైట్ అని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మనిషి అయినా తప్పు చేస్తే మొత్తం దేశానికే ప్రమాదం అని కుదిరితే ప్రభుత్వాలు మరి కొన్ని పవర్స్ పోలీసులకు ఇవ్వాలని ఎక్కువ పబ్లిక్ అంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news