టిడిపి నేత‌లు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకోం : క‌న్నా

-

Kanna Lakshminarayana Fire On TDP
అమ‌రావ‌తి (గుంటూరు): కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించే చిల్ల‌ర నేతలు టీడీపీలో ఉన్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. టీడీపీ నేతలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరమని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ లైవ్‌లో తిట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని క‌న్నాహెచ్చరించారు. రాష్ట్రాన్ని దోచుకుతింటూ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని కన్నా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని తిడుతూ బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారని, విపత్తును కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటున్నారని కన్నా ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news