తెలంగాణా కేబినేట్ సమావేశం అనంతరం సిఎం కేసీఆర్ మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా నేడు మరో 18 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని వివరించారు. దీనితో 858 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 21 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 651 మంది కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నారని అన్నారు. ఒక్క కేసు కూడా లేని జిల్లాలు తెలంగాణాలో 4 ఉన్నాయని అన్నారు.
ఎవరి ఆరోగ్యం కూడా విషమంగా లేదని చెప్పారు. వరంగల్, యాదాద్రి, భువనగిరి, సిద్ధిపేట, వనపర్తి లో కేసులు లేవని అన్నారు.చాలా దేశాలు లాక్ డౌన్ ని పోడిగిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ విధించి సడలించి మళ్ళీ విధించిన దేశాలు ఉన్నాయని అన్నారు. రేపటి నుంచి తెలంగాణాలో కేంద్రం చెప్పినట్టు ఎలాంటి సడలింపు ఉండదు అని ఆయన పేర్కొన్నారు. పక్కాగా లాక్ డౌన్ అమలు అవుతుందని చెప్పారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ విధించిన రోజున ఏ గైడ్ లైన్స్ ఇచ్చారో అవే కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. కేసుల విషయంలో మే 1 తర్వాత కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 42 దేశాల్లో ఇదే పరిస్థితి ఉందని అన్నారు. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
నిత్యావసర సరుకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. పిల్లల పాలు, కూరగాయలు అన్నీ అందుబాటులో ఉంటాయని, వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు. కేసులు తగ్గితే మన రాష్ట్రానికి ఏ ఇబ్బంది ఉండదు అన్నారు ఆయన. ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.