మొక్క జొన్నలో మంచు వల్ల నష్టం కలగకుండా ఏం చెయ్యాలంటే..?

-

మన దేశంలో వాణిజ్య పంటలలో ఒకటి మొక్క జొన్న.. ఈ పంట వల్ల ఎంతగా లాభాలను పొందుతారో అంతగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మొక్కజొన్న కోతలు, నూర్పిడిల తరువాత వచ్చిన గింజలలో తేమ ఉంటుంది. నిలువలలో బూజులు ఆశించకుండా ఉండేందుకు నూర్పిడి చేసిన మొక్కజొన్నలు 4 రోజులు ఎండబెట్టి తేమను తగ్గించుకోవాలి..

ఆరబెట్టిన మొక్కజొన్న గింజలను శుభ్రమైన గోనె సంచులు , పాలిథిన్ సంచులలో తక్కువ తేమ గల ప్రాంతాలలో అంటే మంచు కురవని ప్రాంతాలలో నిల్వ చేయాలి. నిల్వ చేసే సమయంలో ఎలుకలు, పురుగులు, శిలీంధ్రాలు, తేమ వల్ల నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి..

రైతులు మొక్కజొన్నను ఆరబెట్టి, గ్రేడింగు చేసి తగిన నాణ్యత ప్రమాణాలతో మంచి ధరికి అమ్ముకోవచ్చు. మంచి ధరకు అమ్ముకోవాలంటే తేమ 14శాతం, నంగే మారిన గింజలు 4.5 శాతం కంటే తక్కువ, పాడైపోయిన గింజలు 1.5 శాతం కంటే తక్కువ, సైజు తక్కువ ఉన్న గింజలు 3శాతం కంటే తక్కువ ఉండాలి..అప్పుడే మార్కెట్ మంచి డిమాండ్ ఉంటుంది.

మొక్క జొన్న చొప్పలో 35 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఉంటుంది. వీటితో పాటు అనేక ఉప సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న చొప్ప నేలతో కలిసేలా చేయడం వల్ల పోషకాలు తిరిగి నేలకు చేరి నేలలు సారం కోల్పోకుండా ఉంటాయి.

పొలంలో కండెలు కోసిన తర్వాత మిగిలిన చొప్పను ట్రాక్టరు సహాయంతో నడిచే యంత్రం తో చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. ఈ ముక్కలు రోటోవేటరుతో నేలలో కలిసేలా రోటోవేటరు తో దున్నుకోవాలి. నేలలో కలిసి కుల్లిపోతే పోషక విలువల స్ధాయి పెరుగుతుంది. కొంత మంది ఎరువుల తయారీలో కూడా ఈ చొప్పను వాడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news